టెన్త్ టాపర్లు అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచారు

భారత్ న్యూస్ గుంటూరు…టెన్త్ టాపర్లు అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచారు

-అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్

అవనిగడ్డ ప్రభుత్వ హైస్కూల్ టెన్త్ టాపర్లకు ఎమ్మెల్యే సత్కారం

అవనిగడ్డ: పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో అత్యుత్తమ విద్యా ప్రమాణాలకు నిదర్శనంగా నిలిచారని అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి టాపర్ల అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టెన్త్ టాపర్లు ముమ్మారెడ్డి రిషిత (581), తమటం దివ్యజ్యోతి (574), రాసంశెట్టి వర్షిణి (573)లను ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్ ఘనంగా సత్కరించి అభినందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అవనిగడ్డ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు 49 మంది 500లకు పైగా మార్కులు సాధించటం, గణితం, సైన్స్, సోషల్, హిందీలో నూటికి నూరు మార్కులు, తెలుగులో 99మార్కులు, ఇంగ్లీషులో 98 మార్కులు సాధించటం విశేషం అన్నారు. ఉత్తమ ఫలితాల సాధనకు శ్రమించిన ఉపాధ్యాయులను, పట్టుదలతో టాపర్లుగా నిలిచిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయిని కందుల సుజాత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.