Jalna – Mumbai Vande Bharat Express was flagged off by Hon’ble Prime Minister

భారత్ న్యూస్ హైదరాబాద్.

జాల్నా – ముంబై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ని జెండా ఊపి ప్రారంభం చేసిన గౌరవ ప్రధాన మంత్రి

గౌరవనీయులైన భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ, ఈ రోజు అనగా డిసెంబర్ 30 2023 న అయోధ్య నుండి రిమోట్ వీడియో లింక్ ద్వారా జాల్నా – ముంబై ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ ను గౌరవనీయులైన రైల్వేలు, కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి శ్రీ అశ్విని వైష్ణవ్ మరియు గౌరవనీయులైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గార్ల సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు.
అదే సమయంలో, జాల్నా రైల్వే స్టేషన్‌లో కూడా కార్యక్రమం జరిగింది. ఇందులో గౌరవనీయులైన కేంద్ర రైల్వేలు, బొగ్గు మరియు గనుల శాఖ రాష్ట్ర మంత్రి శ్రీ రావుసాహెబ్ దాదారావు పాటిల్ దాన్వే మరియు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర ప్రభుత్వ హౌసింగ్, ఇతర వెనుకబడిన బహుజన సంక్షేమ శాఖ మరియు జాల్నా జిల్లా సంరక్షక మంత్రి శ్రీ అతుల్ సేవ్ ; మహారాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నాయకుడు శ్రీ అంబదాస్ దాన్వే, గౌరవ ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. వీరితోపాటు ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ శ్రీ అరుణ్‌కుమార్‌ మరియు రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
సభను ఉద్దేశించి శ్రీ రావుసాహెబ్ పాటిల్ దన్వే మాట్లాడుతూ, గౌరవనీయులైన ప్రధాని జాల్నా నుండి ముంబైకి మొదటి వందేభారత్ రైలును జెండా ఊపి ప్రారంభించినందున డిసెంబర్ 30వ తేదీ జాల్నా చరిత్రలో ఒక విశిష్టమైన రోజుగా నిలిచిపోతుందన్నారు. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సమర్ధవంతమైన నాయకత్వంలో, మహారాష్ట్రలోని మరఠ్వాడా ప్రాంతం నుండి మొదటి వందేభారత్ రైలు ప్రవేశపెట్టబడిందని ఆయన పేర్కొన్నారు. 2014 నుండి మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు గణనీయమైన పురోగతిని సాధించాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మహారాష్ట్రకు 12,000 కోట్ల రూపాయల బడ్జెట్‌ను కేటాయించామని, ఇది 2014తో పోల్చితే భారీగా పెరిగిందన్నారు

ఈ సందర్భంగా గౌరవనీయులు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రసంగిస్తూ  జాల్నా నుంచి ముంబయికి వందేభారత్ రైలు సేవలు ప్రారంభించినందుకు ఈరోజు ఒక ముఖ్యమైన సందర్భమని పేర్కొన్నారు. మరఠ్వాడా ప్రాంత ప్రజలకు సెమీ-హై స్పీడ్ రైలును అందించినందుకు గౌరవనీయులైన ప్రధానమంత్రికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గౌరవనీయులైన ప్రధానమంత్రి నాయకత్వంలో దేశవ్యాప్తంగా రైలు అభివృద్ధి పనులు పెద్ద ఎత్తున జరుగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మహారాష్ట్రలో రూ. 1.06 లక్షల కోట్లు వ్యయంతో  రైల్వే మౌలిక సదుపాయాల పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. వందేభారత్ రైలు ప్రపంచ స్థాయి సౌకర్యాలను కలిగి యూరోపియన్ దేశాలలోని  అధునాతన రైళ్లతో సమానంగా ఉందని పేర్కొన్నారు.
రైలు  నం. 20705/20706 జాల్నా- సి ఎస్. టి. ఎమ్ - జాల్నా వందే భారత్ ఎక్స్ ప్రెస్ సాధారణ సేవ సమయాలు

రైలు నం. 20706 సి ఎస్. టి. ఎమ్ . - జాల్నా  వందే భారత్ (01.01.2024 నుండి అమలులోకి వస్తుంది)	
స్టేషన్లు	రైలు నం. 20705 జాల్నా - సి ఎస్. టి. ఎమ్ వందే భారత్ ( 02.01.2024 నుండి అమలులోకి వస్తుంది)
రోజులు	సమయాలు		సమయాలు	రోజులు
వారంలో ఆరు రోజులు ( తప్ప బుధవారం)	13.10 బయలుదేరు సమయం	ముంబై సి ఎస్. టి. ఎమ్	11.55 చేరు సమయం	వారంలో ఆరు రోజులు ( తప్ప బుధవారం)
	13.17/13.19	దాదర్	11.32/11.34	
	13.40/13.42	థానే	11.10/11.12	
	14.04/14.06	కళ్యాణ్	10.55/10.57	
	16.28/16.30	నాసిక్	08.38/08.40	
	17.30/17.32	మన్మాడ్	07.40/07.42	
	19.08/19.10	ఔరంగాబాద్	05.48/05.50	
	20.30  చేరు సమయం 	జాల్నా	05.05 బయలుదేరు సమయం