త్వరలో ఏపీ ఆరోగ్య శాఖలో బదిలీలు

..భారత్ న్యూస్ అమరావతి..త్వరలో ఏపీ ఆరోగ్య శాఖలో బదిలీలు

అమరావతి :

ఏపీలో అవినీతికి చెక్ పెడుతూ పనితీరు మెరుగుపరిచే
దిశగా బదిలీలు చేపట్టనున్న వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటిసారిగా మూడేళ్లు ఒకేచోట పనిచేసిన పాలనా సహాయక సిబ్బంది బదిలీలు చేయనున్నట్లు వెల్లడించింది. పనితీరు ఆధారంగా ప్రిన్సిపల్స్, సూపరింటెండెంట్ల స్థానాల్లో మార్పులు చేయనుంది. పనితీరు ఆధారంగా ఉన్నతస్థాయి వైద్యులను బదిలీలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్య శాఖకు సీఎం ప్రత్యేక వెసులుబాటును కల్పించారు.