భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…నీరసానికి రూ.50 వేలు – జ్వరానికి రూ.70 వేలు – దోచుకుంటున్న ఆస్పత్రులు
రోగుల వ్యాధి నిర్ధారణ కాకుండానే పరీక్షల పేరుతో వైద్యుల అధిక రుసుము – ప్లేట్లెట్ల సంఖ్య తగ్గాయంటూ అనవసర వైద్య పరీక్షలు చేయిస్తున్న వైద్యులు
ప్రజలు ధైర్యంగా ప్రభుత్వ హాస్పిటల్స్ ఉపయోగించు కోవాలని DMHO హితవు

వాతావరణంలో మార్పులొచ్చాయి. పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. చిన్నపాటి జ్వరమొచ్చినా అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇదే పశ్చిమ గోదావరి జిల్లాలోని కొందరు ప్రైవేటు వైద్యులకు కాసులు కురిపిస్తోంది. ప్రజల అనారోగ్యాన్ని అదనుగా తీసుకుని మరీ దోపిడీకి తెరదీస్తున్నారు. అంతేకాకుండా సాధారణ జ్వరానికే రూ.వేలల్లో ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో ఈ ప్రాంతంలోని పేద, మధ్య తరగతి ప్రజలు చితికిపోతున్నారు.
అస్వస్థతకు రూ.50 వేలు: తరచూ కళ్లు తిరుగుతున్నాయని ఓ వ్యక్తి తణుకు రాష్ట్రపతి రోడ్డులోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి వెళ్లాడు. ఎటువంటి పరీక్షలు చేయకుండానే ఏకంగా అత్వసర విభాగానికి (ఐసీయూ)కి తరలించారు. అంతేకాకుండా తర్వాత పరీక్షలు, ఇతర చికిత్సల పేరుతో రూ.50 వేలు బిల్లు వేశారు. దీంతో ఏం చేయాలో తెల