వైభవంగా తిరుమలలో పౌర్ణమి గరుడసేవ
భారత్ న్యూస్ (మీ రిపోర్టర్ హేమంత్) తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు ధగధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు.
గరుడ వాహనం – సర్వపాప ప్రాయశ్చిత్తం

పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది. గరుడవాహనం ద్వారా స్వామివారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియజెబుతారు.
ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి, టీటీడీ బోర్డు సభ్యులు శ్రీ శాంతారామ్, జేఈవో (ఆరోగ్యం&విద్య) డాక్టర్ శరత్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.