ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

..భారత్ న్యూస్ హైదరాబాద్….ప్రభుత్వ ఉద్యోగం రాలేదని యువతి ఆత్మహత్య

హనుమకొండ జిల్లా పెద్దకోడెపాక గ్రామానికి చెందిన రావుల ప్రత్యూష (24) బీటెక్ పూర్తిచేసి రెండేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తోంది.

ఉద్యోగాలకు ఎంట్రన్స్లు రాయగా, కొన్ని మార్కుల తేడాతో ఫలితం రాలేదు.

దీంతో మనస్తాపానికి గురైన ప్రత్యూష శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో దూలానికి ఉరేసుకుంది.

కొద్దిసేపటికి అమ్మమ్మ లక్ష్మి చూసి భయంతో కేకలు వేసింది. చుట్టుపక్కల వారు వచ్చి చూడగా అప్పటికే ప్రత్యూష మృతి చెందింది.