నాగార్జున ఇంటి పండుగలో కనిపించని మిత్రోం జగన్ ఫ్యామిలీ !

..భారత్ న్యూస్ హైదరాబాద్….నాగార్జున ఇంటి పండుగలో కనిపించని మిత్రోం జగన్ ఫ్యామిలీ !

జగన్ నా స్నేహితుడు, చూసి చాలా కాలం అయింది. చూడాలనిపించి వచ్చాను” అని నాగార్జున ఓ సారి తాడేపల్లి ప్యాలెస్ ముందు చెప్పారు. తమ మధ్య ప్రాణస్నేహ బంధం ఉందని చెప్పానే చెప్పారు. జగన్ తో పాటు వ్యాపారాలు చేసిన వారితో జగన్ వ్యాపారాలు చేస్తున్నారు. అవి చాలా పెద్ద డీల్స్ అన్న ప్రచారం ఉంది. ఓ సందర్భంలో విజయవాడ ఎంపీ అభ్యర్థి నాగార్జున అని కూడా అనుకున్నారు. అలాంటి స్నేహత్వం ఇద్దరి మధ్య ఉంది కానీ.. జగన్ ఇంట్లో జరిగిన అఖిల్ పెళ్లి పండుగలో జగన్ కానీ.. ఆయన కుటుంబం నుంచి కానీ ఎవరూ కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది.

నాగార్జున కుమారుడి పెళ్లిని వీలైనంత లో ప్రోఫైల్‌లో పూర్తి చేశారు. ఇంట్లో పెళ్లి చేశారు. స్టూడియోలో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అత్యంత ముఖ్యులకే పిలుపులు ఇచ్చారు. తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంతో పాటు ఏపీ సీఎంను పిలిచారు. పిలుపులకు అమరావతి వెళ్లి చంద్రబాబును కలిశారు. ఆ మేరకు సమాచారం బయటకు వచ్చింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత జగన్‌ను పిలిచినట్లుగా ఎలాంటి ప్రచారమూ జరగలేదు. పిలిచారో లేదో తెలియదు. వారు మాత్రం పెళ్లిలో..రిసెప్షన్ లో కనిపించలేదు.

నాగార్జున రాజకీయ కారణాలతో జగన్ ను ఆహ్వానించకపోవడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే వారి మధ్య రాజకీయసంబంధాల్లేవు.. పూర్తిగా వ్యక్తిగత సంబంధాలు, వ్యాపార సంబంధాలే ఉండవచ్చు.. మరి అలాంటప్పుడు ఆహ్వానించకపోవడానికి అవకాశం ఉంది. నాగార్జున వైపు నుంచి కాకపోయినా… వధువు జైనాబ్ కుటుంబం తరపు నుంచి అయినా జగన్మోహన్ రెడ్డికి ఖచ్చితంగా పిలుపు వెళ్లి ఉంటుంది. ఎందుకంటే వధువు జైనాబ్ తండ్రి జగన్ ప్రభుత్వంలో .. మిడిల్ ఈస్ట్ వ్యవహారాలకు సలహాదారుగా ఉన్నారు. ఆయనకు కేబినెట్ హోదా కూడా జగన్ ఇచ్చారు. ఆయన ఫోటో కూడా బయటకు రాని విధంగా రహస్యంగా ఈ నియామకం చేసి జీతాలిచ్చారు. ఆయన అయినా తన కుమార్తె పెళ్లికి పిలవకుండా ఉంటారా?.

అఖిల్ పెళ్లికి రావాల్సినంత మంది సెలబ్రిటీలు .. రాజకీయ నేతలు రాలేదు. స్వల్పంగానే వచ్చారు. నాగార్జున అలా ప్లాన్ చేసుకున్నారేమో కానీ.. సహజంగానే ఆయన మిత్రులుగా భావిస్తున్న వారు కూడా హాజరు కాలేకపోయారు. వారిలో జగన్ కూడా ఒకరు.