భారత్ న్యూస్ రాజమండ్రి….నేను క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
Jun 03, 2025,
నేను క్షమాపణలు చెప్పను: కమల్ హాసన్
విలక్షణ నటుడు కమల్ హాసన్ తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘నేను తప్పు మాట్లాడలేదు, క్షమాపణలు చెప్పను’ అంటూ తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు. కర్ణాటకలో థగ్ లైఫ్ సినిమా విడుదల చేయడం లేదంటూ పేర్కొన్నారు. అయితే ఇటీవల జరిగిన ఓ ఈవెంట్‌లో తమిళం నుంచే కన్నడ పుట్టిందంటూ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమైన సంగతి తెలిసిందే. ఇక థగ్ లైఫ్ మూవీ జూన్ 5న థియేటర్లలో విడుదల కానుంది.
