భారత్ న్యూస్ గుంటూరు…..గుండెపోటుతో నటి కన్నుమూత
సినీ నటి, మోడల్ షెఫాలీ జరీవాలా (42) కన్నుమూశారు. ముంబైలో నిన్న రాత్రి గుండెపోటుకు గురై తుదిశ్వాస విడిచారు. ‘కాంటా లగా’ మ్యూజిక్ వీడియోలతో ఆమె పాపులర్ అయ్యారు. హిందీలో ముజ్సే షాదీ కరోగి, కన్నడలో హుడుగురు వంటి సినిమాలతో పాటు సీరియళ్లు, వెబ్ సిరీస్లలో నటించారు. హిందీ బిగ్ బాస్-13లో కంటెస్టెంట్ గా
పాల్గొన్నారు. ఆమె మృతిపై బాలీవుడ్ వర్గాలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి.
