మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా…!!పార్టీలో చేరిన ముస్లీం సోదరులతో “పులివర్తి నాని”

భారత్ న్యూస్ గుడివాడ……

మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా…!!

పార్టీలో చేరిన ముస్లీం సోదరులతో “పులివర్తి నాని”

నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చంద్రగిరి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని అన్నారు. సోమవారం పాకాల మండలం, మెగరాలకు చెందిన ముస్లిం సోదరులు తిరుపతి రూరల్ మండలం, రఘునాథ్ రిసార్ట్స్ లోని పార్టీ కార్యాలయంలో పులివర్తి నాని సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన ముస్లీం సోదరులు మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రి కాకపోతే రాష్ట్రాన్ని అమ్మేస్తారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేనంత మెజార్టీని మొగరాల బూతులో తీసుకువస్తామని తెలిపారు. మనస్పర్థలు వీడి అందరం కలిసి కట్టుగా ఉంటామని చెప్పారు. గ్రామ సమస్యలు పరిష్కారానికి ఎల్లప్పుడూ ముందుంటానని పులివర్తి నాని హామీ ఇచ్చారు. పార్టీలో చేరిన వారిలో పఠాన్, అన్వర్ భాష, ముస్తఫా, హౌనూరు భాష, అడ్డాస్, సయ్యద్ కరీం, మస్తాన్, మహమ్మద్ దిల్, బషీర్, మునాఫ్, పిరం సాహెబ్, హుస్సేన్, సుభాన్, సెహాద్, హిబ్రం, చాంద్ బాషా, మహబూబ్ బాషా, దావూద్, హుస్సేన్, గౌనుర్ భాష, పీరా, కాజా తదితరులు ఉన్నారు.