స్మార్ట్ మీటర్లపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశాలు..

భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…స్మార్ట్ మీటర్లపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ ఆదేశాలు..

క్షేత్ర స్థాయి విచారణకు ఆదేశం: పరిశ్రమలు, వాణిజ్య సంస్థలకు అమర్చిన స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయన్న ఆరోపణలపై మంత్రి గొట్టిపాటి రవి కుమార్ స్పందించారు.

సమగ్ర దర్యాప్తు: స్మార్ట్ మీటర్ల పనితీరు, అధిక ఛార్జీల ఆరోపణలపై సమగ్ర విచారణకు ఆదేశించారు.

నివేదిక సమర్పణ: సోమవారం నాటికి పూర్తి నివేదికను సమర్పించాలని అధికారులకు ఆదేశం.

అధిక భారం ఉండదు: “ఎవరిపైనా అనవసరంగా ఒక్క రూపాయి భారం మోపేది లేదు” అని మంత్రి స్పష్టం చేశారు.

పనితీరుపై నిశిత పరిశీలన: స్మార్ట్ మీటర్ల పనితీరుపై నిశితంగా పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు.