ప్రదోషం రోజున సాయంత్రం ప్రదోష వేళలో శివాలయాలలో అభిషేకం

భారత్ న్యూస్ తిరుపతి…..ఈరోజు ప్రదోషం … ప్రదోషం రోజున సాయంత్రం ప్రదోష వేళలో శివాలయాలలో అభిషేకం చేస్తారు, అప్పుడు శివలింగానికి మరియూ నందీశ్వరునికి ఏక కాలంలో అభిషేకం చేస్తారు, జాతకంలో గోచరించని దోషాలు సైతం నందీశ్వరునికి చేసే అభిషేకం దర్శిస్తే తొలగిపోతాయని శాస్త్ర వచనం … వీలైతే అభిషేకం చేయించండి లేదా అభిషేకాన్ని దర్శించండి, ప్రదోష వేళలో #అరుణాచలశివ నామస్మరణ చేస్తూ ఉండండి, శివానుగ్రహం పొందండి …

ప్రదోషం అంటే దోషాలను తొలగించేది అని అర్థం. ప్రతి రోజూ సూర్యాస్తమయ కాలంలో దాదాపు ఆరు ఘడియల (రెండు గంటల 24 నిమిషాల) సమయాన్ని ప్రదోష కాలంగా పరిగణిస్తారు. ప్రదోష కాలములో త్రయోదశి తిథి ఉంటే దానిని మహా ప్రదోషం అంటారు. మహా ప్రదోషం రోజున శివ భక్తులు ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు.

రెండు త్రయోదశి తిథులలో (శుక్ల పక్షము మరియు కృష్ణ పక్షము) ప్రదోష వ్రతాన్ని ఆచరిస్తారు. కొన్ని ప్రాంతాలలో మాత్రం కేవలం కృష్ణ పక్ష ప్రదోషం రోజును మాత్రమే పాటిస్తారు.

ప్రదోష సమ🙏