..భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో రేషన్ కార్డు దరఖాస్తుకు గడువు లేదు: ఏపీ ప్రభుత్వం
అమరావతి :
ఏపీ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రేషన్ కార్డు దరఖాస్తులకు గడువు లేదని అర్హత ఉన్న వారు ఎప్పుడైనా పెట్టుకోవచ్చని వెల్లడించింది. దరఖాస్తులు నిరంతరంగా జరిగే ప్రక్రియ అని ప్రజలు తొందరపడవద్దని సూచించింది. అలాగే దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోపే కొత్త కార్డులు అందరికీ ఇస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఇక కేంద్రం ఈకేవైసీని తప్పనిసరి చేయడంతో దేశంలో 95శాతం ఈకైవైసీ పూర్తిచేసుకున్న ఏకైక రాష్ట్రంగా ఏపీ నిలిచిందని
తెలిపారు.
