టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గామంత్రి నారా లోకేష్

భారత్ న్యూస్ రాజమండ్రి…టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా
మంత్రి నారా లోకేష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…పొలిట్ బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. విధేయత, కష్టపడే తత్వం, అనుభవాన్ని లెక్కలోకి తీసుకుని పదవులు ఇచ్చిన అధిష్టానం. పనిచేసేవారికే పార్టీలో పెద్దపీట అన్న సంకేతాన్ని ఇచ్చిన పార్టీ. కార్యకర్తే పార్టీకి అధినేత అన్న వినూత్న ఆలోచనలతో పార్టీని తిరుగులేని సైన్యంగా తీర్చిదిద్దుతున్న మంత్రి లోకేష్ కు టీడీపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు అప్పచెప్పింది.

టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మరోసారి పల్లా శ్రీనివాస్ నియమించబడ్డారు. సీనియర్లకు గౌరవం… కొత్తవారికి అవకాశాలు…మరియు సామాజిక కోణంలో నూతన కమిటీల కూర్పు జరిగినట్టు తెలుస్తోంది.

29 మందితో పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన పొలిట్ బ్యూరో నియామకాలు జరిగాయి. గజపతినగరం మండల పార్టీ అధ్యక్షురాలు గంట్యాడ శ్రీదేవి, మంగళగిరి క్లస్టర్ ఇన్ఛార్జ్ గుత్తికొండ ధనుంజయ్ లకు పొలిట్ బ్యూరోలో చోటు కల్పిస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు కీలకనిర్ణయం తీసుకున్నారు.

31 మందితో కూడిన జాతీయ కమిటీలో ముగ్గురు జాతీయ ప్రధాన కార్యదర్శులు కాగా 18 మందిని జాతీయ ఉపాధ్యక్షులుగా, 10 మందిని జాతీయ అధికార ప్రతినిధులుగా నియమించింది.

రాష్ట్ర కమిటీలో 185 మంది ఉండగా వీరిలో 7గురు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, 16 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులు, 14 మంది రాష్ట్ర అధికార ప్రతినిధులు, 10 మంది రాష్ట్ర జోనల్ కో-ఆర్డినేటర్లు, 59 మంది రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు, 77 మంది రాష్ట్ర కార్యదర్శులు ఉన్నారు.

నాలెడ్జి కమిటీ, హెచ్ఆర్డీ కమిటీల్లో ఒక్కొక్కరిని నియమించారు.

రేపు పార్లమెంటులో మహిళా బిల్లు ప్రవేశపెడుతున్న శుభవేళ… టీడీపీ రాష్ట్ర కమిటీలోని 185 మందికి గానూ… 50 మంది మహిళలకు చోటు కల్పించింది. అలాగే పొలిట్ బ్యూరో, జాతీయ కమిటీల్లోనూ మహిళలకు సముచిత స్థానం కల్పించింది.

185 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల్లో 122 మంది (బీసీ-77, ఎస్సీ-25, ఎస్టీ-7, మైనార్టీ-13) బడుగులకు చంద్రబాబుగారు చోటు కల్పించారు.

పార్టీకి యువ నాయకత్వం అందుబాటులోకి వచ్చేలా నియామకాలు జరిగాయి. అలాగే
నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు రాని వారికి పార్టీ పదవుల ద్వారా న్యాయం జరిగింది. ముఖ్యంగా పార్టీ బలోపేతానికి కష్టపడిన వారికి, విధేయులకు పెద్ద పీట వేశారు….