భారత్ న్యూస్ విశాఖపట్నం..కొచ్చి తీరంలో హై అలర్ట్..మునిగిన నౌకలో ప్రమాదకర రసాయనాలు..!
లైబీరియాకు చెందిన ఓ భారీ నౌక కేరళ సముద్ర తీరానికి 38 నాటికల్ మైళ్ల దూరంలో శనివారం ప్రమాదానికి గురైంది. తాజాగా అది పూర్తిగా సముద్రంలో మునిగిపోయినట్లు ఇండియన్ కోస్ట్ గార్డ్ (ICG) ప్రకటించింది. ఈ నౌకలో 640 కంటైనర్లు ఉండగా.. వాటిలో 13 కంటైనర్లలో ప్రమాదకరమైన రసాయనాలు, 12 కంటైనర్లలో కాల్షియం కార్బైడ్, మిగిలిన వాటిలో 84.44 మెట్రిక్ టన్నుల డీజిల్, 367.1 మెట్రిక్ టన్నుల ఫర్నేస్ ఆయిల్ ఉన్నట్లు తెలిపింది. ఇవి లీకైతే సముద్ర జలాలు తీవ్రంగా కలుషితమయ్యే ప్రమాదం ఉండడంతో అధికారులు కొచ్చి తీరంలో హై అలర్ట్ ప్రకటించారు.
