విదేశి ఉద్యోగాలు ఆశచూపి హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్ట్యూట్ టోకరా

భారత్ న్యూస్ రాజమండ్రి…Ammiraju Udaya Shankar.sharma News Editor….విదేశి ఉద్యోగాలు ఆశచూపి హోటల్ మేనేజ్మెంట్ ఇనిస్ట్యూట్ టోకరా

పల్నాడు జిల్లా పిడుగురాళ్ల లలితా టూరిజం అండ్ హోటల్ మేనేజ్మెంట్ విదేశి ఉద్యోగాలను ఆశచూపి విద్యార్థుల నుంచి కోట్లాది రూపాయలు దోచుకున్నారు.

పల్నాడు జిల్లా పోలీసు ప్రజా వేదికలో బాధితులు ఫిర్యాదు చేశారు. ఒక్కొక్కరి నుంచి ₹30 లక్షల నుంచి ₹40 లక్షలు కొల్లగొట్టారు.

ఇనిస్ట్యూట్ యజమాని పసుమర్తి కిషోర్, మేనేజర్ కత్తి సునీతలు తమ వద్ద సుమారు ₹5 కోట్లలకు పైగా వసూలు చేశారన్నారు.

డబ్బులు అడిగితే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు.