భారత్ న్యూస్ రాజమండ్రి….కృష్ణంరాజు, కొమ్మినేనిలను అరెస్టు చేయాలి

కూటమి నాయకుల డిమాండ్
అవనిగడ్డ:
అమరావతి మహిళలపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు, కొమ్మినేనిలను అరెస్టు చేయాలని జనసేన పార్టీ నాయకులు అన్నపరెడ్డి వెంకటస్వామి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం అవనిగడ్డలోని ఎమ్మెల్యే కార్యాలయంలో టీడీపీ, జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు.
టీడీపీ మండల అధ్యక్షులు యాసం చిట్టిబాబు, వెంకటస్వామి, సీనియర్ నాయకులు గుడివాక శివరావు మాట్లాడుతూ స్త్రీలను దేవతలుగా గౌరవించే దేశంలో అత్యంత నీఛమైన మాటలతో అమరావతి ప్రాంత మహిళలను ఘోరంగా అవమానపరచటం వైసీపీ వైఖరికి నిదర్శనం అన్నారు. జర్నలిస్టుల ముసుగులో ఉన్న ఇద్దరు వైసీపీ కార్యకర్తలు చేసిన అతి జుగుప్సాకరమైన వ్యాఖ్యలు వారి దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు. కృష్ణంరాజుకు వత్తాసు పలికిన కొమ్మినేనిని సాక్షి నుంచి తొలగించాలని, మహిళలను అవమానించిన కొమ్మినేనికి ఏ ఛానల్లో కూడా ఉద్యోగం ఇవ్వకూడదని విజ్ఞప్తి చేశారు. అమరావతి ఉద్యమంలో వైసీపీ పెట్టిన అక్రమ కేసులన్నీ తొలగించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మహిళలను ఎవరు అవమానించినా ప్రభుత్వం గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.
సమావేశంలో నీటి సంఘ అధ్యక్షులు దాసినేని శ్రీనివాసరావు, కూటమి నాయకులు బచ్చు శ్రీనివాసరావు (బర్రంకుల శ్రీను), ముళ్లపూడి శ్రీనివాసరావు, గరికపాటి శ్రీనివాసరావు, తుంగల శ్రీనివాసరావు, యలవర్తి నాగ మునేశ్వరరావు (చిన్నా), కొట్టె విజయ్, కొండవీటి పాండురంగారావు, చంద్రా తదితరులు పాల్గొన్నారు.