భారత్ న్యూస్ విశాఖపట్నం..తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల మూసివేత వాయిదా
జూన్ 1న సినిమా థియేటర్లు మూసివేత నిర్ణయం వాయిదా పడింది. ఇవాళ తెలుగు రాష్ట్రాల్లోని సినిమా డిస్ట్రిబ్యూటర్ తొ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ సమావేశమైంది. డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్లలో మెజారిటీ సభ్యులు సమ్మె వద్దని సూచించారు. థియేటర్లు రన్ చేస్తూనే సమస్య పరిష్కరించే విధంగా కృషిచేయాలని నిర్ణయం తీసుకున్నారు. థియేటర్ల మూసివేత కార్యక్రమాన్ని పునరాలోచించుకుని, తెలుగు ఇండస్ట్రీ అభివృద్ధికి సహకరించే విధంగా తోడ్పడాలని ఎగ్జిబిటర్లకు తెలిపారు.
