భారత్ న్యూస్ గుంటూరు…..గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల సమీపంలో గుంటూరు to పర్చూరు ఓల్డ్ మద్రాస్ రోడ్ లో రాత్రి 2గంటల సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాపట్ల జిల్లా వాసి ఇంటలిజెన్స్ కానిస్టేబుల్ కీర్తి వెంకటరాజు మృతి చెందారు.స్నేహితుడు డివిఎస్ గుప్తాతో కలిసి వెంకటరాజు గుంటూరు నుండి చీరాలకు కారులో వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.అక్కడికక్కడే రాజు మృతి చెందగా గుప్తాకు బలమైన గాయాలయ్యాయి 108లో గుంటూరు ggh కి తరలించారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు
