భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖపట్నం :
ఏపీలో కోవిడ్ పాజిటివ్ కేసు నమోదు
విశాఖపట్నం మద్దిలపాలెంలో ఓ వివాహితకు కరోనా పాజిటివ్

ఏపీలో విశాఖపట్నంలో గురువారం కోవిడ్ పాజిటివ్ కేసు నమోదైంది. విశాఖపట్నం మద్దిలపాలెం, UPHC పిఠాపురం కాలనీకి చెందిన వివాహితకు
కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.
ఆమెతో పాటు భర్త ఇద్దరు పిల్లలకు కూడా RTPCR పరీక్షలు చేశారు. ముందుగా మలేరియా డెంగ్యూ అని భావించి వైద్య పరీక్షలు నిర్వహించగా, కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. కాగా, కోవిడ్ కేస్ నమోదైన చుట్టుపక్కల వారందరికీ నిర్దారణ పరీక్షలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది.
అలాగే వారం రోజుల పాటు వారు హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కొవిడ్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.