RK Roja: గాలిలో గెలిచిన గాలిగాళ్లు ఎక్కుయ్యారు.. మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ ……

భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…RK Roja: గాలిలో గెలిచిన గాలిగాళ్లు ఎక్కుయ్యారు.. మాజీ మంత్రి రోజా సంచలన కామెంట్స్ ……

మాజీ మంత్రి రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. నగరిలో నిర్వహించిన రీకాలింగ్ చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా గాలిలో గెలిచిన వారే ఎక్కువైపోయారంటూ విమర్శలు చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ వీకెండ్ నాయకులు అని ఫైర్ అయ్యారు. ఒక్కరు కూడా ప్రజల దగ్గరికి వెళ్లి వాళ్ల కష్టం ఏంటో అడగరని అన్నారు. వైసీపీ అధికారంలోకి వస్తే టీడీపీ, జనసేన నేతలు అమెరికా పారిపోవాలని చెప్పారు. చంద్రబాబు డబ్బులు ఎక్కువగా ఇస్తున్నారని అందుకే పవన్ కళ్యాణ్‌కు పిచ్చి బాగా ముదిరిపోయిందంటూ ఆరోపించారు.

“రాష్ట్రంలో గాలిలో గెలిచిన గాలిగాళ్లు ఎక్కువైపోయ్యారు. ఎమ్మెల్యేలు ఒక్కడు కూడా ఒక రైతు దగ్గరికి మీ కష్టం ఏంటి అని పోయి అడగడు. మీకు ఏం చేయాలని అడగరు. రైతులంతా సంతోషంగా ఉన్నారంట.. రైతులందరికీ మా రైతులకి మద్దతు ధర ఇస్తున్నారట.. జగన్‌ మోహన్ రెడ్డికి.. రోజమ్మకి పిచ్చి అందుకే ఊరికే మమ్మల్ని తిడుతుందని అంటున్నారు. అన్ని గోవులు చనిపోతుంటే కూడా వచ్చి చూసి.. దానికి సంబంధించి తప్పు చేసిన వాళ్లను శిక్షించి మళ్లీ గోవులను చనిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఉందా.. లేదా..? నువ్వేం సనాతన యోధుడివని అని ప్రశ్నిస్తున్నాం. అలాగే శ్రీశైలంలో తాబేలు మహావిష్ణువుతో సమానం. అవి చనిపోతుంటే అక్కడికైనా వెళ్లావా.. అంటే అక్కడికి వెళ్లవు కానీ తమిళనాడుకి వెళ్తాడు.

తమిళనాడుకు వెళ్లి నేను తమిళనాడులో పుట్టా. తమిళనాడులో పెరిగా అంటాడు. ఈయన ఎక్కడ పుట్టాడు. ఎక్కడ పెరిగాడు..? ఏం చదువుకున్నాడు..? గుంటూరుకి వెళ్లినప్పుడు ఇక్కడే పుట్టాను అంటాడు. ఒంగోలుకి వెళ్తే ఇక్కడే పుట్టాను అంటాడు. పిఠాపురం వెళ్తే ఇక్కడే పుట్టాను అంటాడు. మొన్న తమిళనాడుకి పోయి ఇక్కడే పుట్టాను. ఆయనకి పిచ్చి ముదిరిపోయింది. ఆయన ఒక సినిమాలో డైలాగ్ చెప్పాడు. నాకు కొంచెం తిక్కు ఉంది.. దానికి లెక్క ఉందని చెప్పాడు. చంద్రబాబు నాయుడు బాగా లెక్కిస్తున్నట్లు ఉన్నాడు. ఆ తిక్క ముదిరి ముదిరి పాపం పడుతుంది తప్ప తగ్గట్లేదు. అందరూ వీకెండ్‌కు ఫ్యామిలీని చూడటానికి వెళ్తారు. కానీ పవన్ వీకెండ్‌కు మాత్రమే ఆంధ్రప్రదేశ్‌కి వస్తాడు. అంతవరకు షూటింగ్ చేసుకుంటాడు. డబ్బింగ్ చేసుకుంటాడు. ఆయన కార్యక్రమాలు చేసుకుంటాడు.

ఇప్పుడే హైదరాబాద్‌కు పారిపోయే వాళ్లు.. రేపు జగనన్న ప్రభుత్వం వస్తే వీళ్లు హైదరాబాద్ కాదు.. అమెరికాకు పారిపోతారు. ఆ రోజు మిమ్మల్ని కాపాడటానికి ఎవ్వరు ఉండరు. వీళ్లని నమ్మితే ఈరోజు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్లని మీరు
టార్చర్ పెట్టినా.. కేసులు పెట్టించినా.. కొట్టినా.. దానికి 100 రేట్లు మీకు వడ్డీతో కూడా తిరిగి ఇచ్చేస్తాం..” అంటూ రోజా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.