భారత్ న్యూస్ గుంటూరు….చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో స్వర్ణయుగం ..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో స్వర్ణయుగం మొదలైందని తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ పరిశీలకులు కనపర్తి శ్రీనివాసరావు, సీనియర్ నాయకులు బొబ్బా గోవర్ధన్ అన్నారు. మండల పరిధిలోని మోదుమూడి గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం జరిగింది.. ఈ సందర్భంగా కనపర్తి శ్రీనివాసరావు, బొబ్బా గోవర్ధన్ లు గ్రామంలోని ప్రజలతో మాట్లాడుతూ గడచిన అయిదేళ్లలో పోలవరం ప్రాజెక్టు ను వైసీపీ నిర్లక్ష్యం చేసిందని, చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి పోలవరం ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. జగన్ నిర్వాకంతో రాష్ట్రం అప్పుల కుప్పగా మారినా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను కట్టుదిట్టంగా అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందిందని వివరిస్తూ గ్రామంలో ఒక్కో కుటుంబానికి అందిన లబ్ధిని గురించి ప్రజలకు వివరించి తక్షణం పరిష్కరించాల్సిన సమస్యలు, దీర్గ కాలంగా పడుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు.. ఈ సందర్భంగా ప్రజల నుంచి ప్రభుత్వ పథకాల గురించి స్పందన అడిగి తెలుసుకొని రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.. ఈ కార్యక్రమంలో దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరు వెంకటేశ్వరరావు, తెలుగుదేశం నేతలు కర్రా సుధాకర్, పర్చూరి దుర్గా ప్రసాద్,బండే శ్రీనివాసరావు,బండే రాఘవ, మండలి రామ్మోహన్ రావు,మేడికొండ విజయ్, బచ్చు హనుమాన్, దాసినేని శ్రీనివాసరావు, మెరుగు సోమిరెడ్డి, బచ్చు గోపాల్ కృష్ణా, జొన్నగూటి వెంకన్న, బచ్చు మురళీ, బచ్చు రంగనాథ్ , బచ్చు వేణుగోపాల్, తోట సురేష్, బచ్చు వెంకట కృష్ణారావు,దాసినేని సాంబయ్య ,కంచర్ల ఆనంద్, కమ్మిలి సుబ్రమణ్యం, గాలం శ్రీను,పిల్లి మల్లికార్జున రావు, జాన్ విల్సన్, బండే వెంకటేశ్వరరావు, కటికల బాలాజీ,కొల్లూరి ఇమ్మనియేలు,నాగిడి రాంబాబు,గోశాల బాల కోటేశ్వరరావు,కొక్కిలిగడ్డ లక్ష్మణరావు, బొంతు రవి చంద్ర, మట్టా బాపూజీ, చెన్నగిరి అయ్యప్ప,చెన్ను గురుమూర్తి, షేక్ బాబావలి,చిరువోలు నరసింహారావు, బచ్చు వసంత్ తదితరులు పాల్గొన్నారు.
