భారత్ న్యూస్ అనంతపురం .. Ammiraju Udaya Shankar.sharma News Editor……చెప్పి కాదు.. చెప్పకుండా నరికెయ్యాలి
మన ప్రభుత్వం వచ్చాక వేసేయండి
రెండో కంటికి చెప్పాల్సిన అవసరం లేదు
ఎన్నిసార్లు రప్పా రప్పా అంటార్రా?
మొరిగే కుక్క కరవదని తెలుసుకోండి
చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి
వైసీపీ కార్యకర్తల సమావేశాల్లో మాజీ మంత్రి పేర్ని నాని వ్యాఖ్యలు
రప్పా రప్పా అని నరుకుతామంటూ అరవడం కాదురా.. చీకట్లో కన్ను కొడితే పని అయిపోవాలి. మీకు చేతనైతే రేపు మన ప్రభుత్వం వచ్చాక ఎవడెవడు తప్పులు చేశాడో వాళ్లను నరికెయ్యండి! ఆ తర్వాత ఎలా జరిగిందంట మీరంతా వెళ్లి పలకరించాలి’ అంటూ వైసీపీ కార్యకర్తలను మాజీ మంత్రి పేర్ని నాని రెచ్చగొట్టారు. కృష్ణాజిల్లా పామర్రు, అవనిగడ్డలలో గురు, శుక్రవారాల్లో నిర్వహించిన కార్యకర్తల సమావేశాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘చెప్పి నరకడం కాదు, చెప్పకుండా నరికెయ్యాలి’ అని కార్యకర్తలను మరింత రెచ్చగొడుతూ ప్రసంగించారు. మన ప్రభుత్వం వస్తే మీకే ప్రధాన పోస్టులు వస్తాయని ఊరిస్తూ… ‘లోకేశ్ (వాడు అంట సంబోధన) ఎర్ర బుక్కు అన్నట్టుగా మీరు రప్పా.. రప్పా అంటున్నారు. అయినా నోరు తెరిచి ఎన్నిసార్లు రప్ప రప్పా అంటార్రా? సిగ్గు, శరం ఉండాలి మనకు… అరె.. చీకట్లో కన్ను కొడితే అయిపోవాలి.. అయినా చీకట్లో చేయాల్సిన పనులు పట్టపగలు చెప్పడమేంటి అసహ్యంగా?’ అని వ్యాఖ్యానించారు. ‘నిజంగానే మన ప్రభుత్వం వచ్చి వేసేయెండి అంటే ఎవరు వేసేది? నాకు పాతికేళ్ల అనుభవం ఉంది. శతృవుకు ఎక్కడ చెప్పాలో అక్కడ చెప్పాలి! రోజూ ఇదే పనేనా? మారండి. మొరిగే కుక్క కరవదు.. కరిచే కుక్క మొరగదు.. రేపు 2.0 చూపించాలి’ అంటూ కార్యకర్తలకు నిర్దేశించారు.
