భారత్ న్యూస్ కడప ….ఇమే మాములు స్త్రీ కాదు బాబోయ్….తల్లికి వందనం డబ్బుతో మద్యం తాగాడని…కట్టుకున్న భర్తను హత్య చేసిన భార్య
ప్రభుత్వం మంజూరు చేసిన తల్లికి వందనం డబ్బును మద్యం కోసం ఖర్చుచేసిన భర్త చంద్రశేఖర్
ఆగ్రహంతో మద్యంలో విషం కలిపి, ఆపై గొంతు నులుమి హత్య చేసిన భార్య రమాదేవి
అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లె గ్రామంలో ఘటన
అన్నమయ్య జిల్లా రెడ్డిగానిపల్లె గ్రామంలో భార్య తన భర్తను హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం తల్లికి వందన పథకం కింద ఇచ్చిన డబ్బుతో భర్త మద్యం సేవించాడనే కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. ఈ కేసులో నిందితురాలు రమాదేవిని పోలీసులు అరెస్టు చేశారు. మదనపల్లె డీఎస్పీ మహేంద్ర కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
భవన నిర్మాణ కార్మికుడు వంకోళ్ల చంద్రశేఖర్ (46)కు 20 ఏళ్ల క్రితం రమాదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. చంద్రశేఖర్ మద్యంకు బానిసై కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో రమాదేవికి పాలెంకొండకు చెందిన వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది.

ఇటీవల పిల్లలిద్దరికీ తల్లికి వందనం పథకం కింద ప్రభుత్వం విడుదల చేసిన డబ్బు రమాదేవి ఖాతాలో జమ అయిం