భారత్ న్యూస్ ఢిల్లీ…..రాజ్యసభ ప్రతిపక్ష నేతగా మళ్లీ మల్లికార్జున ఖర్గే ప్రమాణ స్వీకారం
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మరోసారి రాజ్యసభ ప్రతిపక్ష నేతగా అధికారిక గుర్తింపు పొందారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజ్యసభకు తిరిగి ఎన్నికైన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆయనను ప్రతిపక్ష నేతగా గుర్తిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సోమవారం రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సమక్షంలో ఖర్గే ఎంపీగా ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 25తో ఆయన సభ్యత్వం ముగియడంతో సాంకేతికంగా ప్రతిపక్ష నేత పదవి కోల్పోయినా, తిరిగి ఎన్నిక కావడంతో రాజ్యసభ సెక్రటేరియట్ ఆయనను మళ్లీ అదే పదవికి గుర్తించింది.
కాగా, దీనిపై కాంగ్రెస్, ఇండియా కూటమి నేతలు హర్షం వ్యక్తం చేశారు…..