అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపిన సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి

పాకాల (భారత్ న్యూస్) తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం కావలివారిపల్లి గ్రామ సచివాలయం దగ్గర నిర్వహించిన యోగాంధ్ర–సంజీవని కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.ఈ కార్యక్రమం ని మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు, మన చంద్రగిరి ఎమ్మెల్యే శ్రీ పులివర్తి నానీ అన్న గారు వీరు అందరి ఆదేశాలు మేరకు”ఇంటింటికి యోగా” కార్యక్రమం ద్వారా యోగాను ప్రతి ఇంటికి చేరవేయడం అభినందనీయం. అభివృద్ధి, సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం పట్ల కూడా ప్రభుత్వం ప్రత్యేక బాధ్యత వహించడం సంతోషకరం.
యోగా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతతను కూడా అందిస్తుంది. ముఖ్యంగా మహిళలు ప్రతిరోజూ కొంత సమయం యోగాకు కేటాయించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని కోరుకుంటున్నాను.ఈ కార్యక్రమంలో సింగల్ విండో చైర్మన్ క్రిష్ణమనేని సావిత్రి, పంచాయితీ కార్యదర్శి బషీర, సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.