తుమ్మలగుంట గ్రామపంచాయతీలో “యన్ టి ఆర్ భరోస” పెన్షన్ల పంపిణీ!
తిరుపతి( భారత్ న్యూస్ )తిరుపతి రూరల్ మండలము తుమ్మలగుంట గ్రామ పంచాయతీ నందు జూన్ నెల 1వ తేదీ సోమవారము ఉదయం గ౹౹ 6.30 ని౹౹ “యన్ టిఆర్ భరోస” సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కార్యక్రమము తుమ్మలగుంట గ్రామ పంచాయతీ అధికారులు,సచివాలయం సిబ్బంది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు బిరుదాల భాస్కర్ రెడ్డి, టిడిపి నాయకులు అందరు కలసి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని గారి ఆదేశాలమేరకు టిడిపి నాయకులు పెన్షన్ల దారుల ఇంటి కెళ్ళి బాధ్యతగా నిర్వహించి పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తుమ్మలగుంట టీడిపి రాష్ట్ర నాయకులు బిరుదాల. భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం తద్వారా నిరుపేద వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు, మరియు ఒంటరి మహిళలకు, వికలాంగులకు, పెన్షన్ల దారుల ఇంటి వద్ద కు వెళ్ళి”యన్ టి ఆర్ భరోస” పెన్షన్ పంపిణీ చేసి వారికి అండగా నిలవడం తెలుగుదేశం పార్టీకే సాధ్యమని ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనటం సంతోషంగా ఉందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం నిరుపేదలకు, మధ్యతరగతి ప్రజలకు పెద్దపీట వేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూటమివైపే ఉన్నారని పేదల పక్షాన నిలుస్తున్న కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ మద్దతుగా నిలుస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి వెంకటేశ్వర్లు, యోగానంద రెడ్డి,మోహన్,వినయ్,చత్రపతి, విజయ్,మహేష్, మహిళ పోలీస్,అమల, ఎ యన్ యం,ఓ. కేశవులుశెట్టి,జి.సుబ్రమణ్యం,టిడి పి మాజీ యం పి టి సి ఎస్.సరస్వతి, పి.జయచంద్రా రెడ్డి, ఎస్ వెంకటేష్ నాయుడు,టి.లక్ష్మీనారాయణ, పి.మనోహర్,బాలు,ఆంజనేయులు,తదితరులు పాల్గొన్నారు.
