భారత్ న్యూస్ హైదరాబాద్…హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత ప్రజా రవాణాను పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర

Ammiraju Udaya Shankar.sharma News Editor…రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) మరో కీలక అడుగు వేసింది. గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కూకట్పల్లి డిపోకు చెందిన 60 నూతన ఎలక్ట్రిక్ బస్సులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు.
బస్సుల ప్రారంభోత్సవం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భవిష్యత్తులో హైదరాబాద్ నగరం వాయు కాలుష్యం కోరల్లో చిక్కుకుని మరో ఢిల్లీలా మారకూడదనే ఉద్దేశంతోనే పర్యావరణహిత ఎలక్ట్రిక్ బస్సులను పెద్ద ఎత్తున అందుబాటులోకి తెస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ఒక్క హైదరాబాద్లోనే 540 ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1050 ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయని ఆయన వెల్లడించారు.
కార్మిక సంక్షేమం గురించి మంత్రి మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కార్మిక సంఘాలకు గుర్తింపు ఎన్నికలు నిర్వహిస్తామని, ఆ తర్వాత ఎన్నికైన సంఘాలతో కలిసి ఆర్టీసీ విలీన ప్రక్రియను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. కార్మికులకు పీఆర్సీ (PRC) అమలుతో పాటు వారి సంక్షేమానికి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందన్నారు. కార్మికుల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రతి రెండో మంగళవారం ప్రత్యేకంగా సమయం కేటాయించనున్నట్లు మంత్రి ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి మాట్లాడుతూ ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు మరియు బస్టాండ్లలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని ప్రయాణాన్ని అందించడంతో పాటు, ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఈ ఈవీ బస్సులు కల్పిస్తాయని నాగిరెడ్డి వెల్లడించారు.ఈవీ బస్సుల విస్తరణలో భాగంగా ప్రధాన డిపోలు మరియు బస్టాండ్లలో అత్యాధునిక ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం లేని ప్రయాణాన్ని అందించడంతో పాటు, ప్రయాణికులకు అత్యంత సౌకర్యవంతమైన, సురక్షితమైన ప్రయాణ అనుభవాన్ని ఈ ఈవీ బస్సులు కల్పిస్తాయని వెల్లడించారు. సంస్థను లాభాల బాటలో నడిపిస్తూనే, ప్రయాణికులకు సురక్షితమైన మరియు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. కొత్తగా ప్రవేశపెట్టిన ఎలక్ట్రిక్ బస్సులు ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయని, పర్యావరణ పరిరక్షణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాలని కోరారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండీ నాగిరెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్,కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, కలెక్టర్ మను చౌదరి లు నూతన బస్సుల్లో ప్రయాణించారు.
ఈ కార్యక్రమంలో
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్,కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బండి రమేష్, మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఆర్టీసీ ఈడీ లు సిహెచ్.వెంకన్న, రాజశేఖర్ లతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

“పీఆర్ఓ. టీజీఎస్ ఆర్టీసీ”