మీడియా ప‌ట్ల ప్రధాని మోదీ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టిన ఎడిట‌ర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియా

భారత్ న్యూస్ ఢిల్లీ…..మీడియా ప‌ట్ల ప్రధాని మోదీ వైఖ‌రిని త‌ప్పుప‌ట్టిన ఎడిట‌ర్స్ గిల్డ్‌ ఆఫ్ ఇండియా

యురోపియ‌న్ జ‌ర్న‌లిస్టుల‌తో చోటుచేసుకున్న ప‌రిణామాలు సిగ్గుచేటు ఘ‌ట‌న అని ఎడిట‌ర్స్ గిల్డ్ అభిప్రాయ‌ప‌డింది. భార‌త్‌లో ఉన్న ప‌త్రికా స్వేచ్ఛ‌, బాధ్య‌త‌పై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. మీడియాను శ‌త్రువుగా చూడ‌డం మానుకోవాల‌ని ఎడిట‌ర్స్ గిల్డ్ త‌న ప్ర‌క‌ట‌న‌లో కోరింది.

2014 నుంచి దేశ ప్ర‌ధానిగా మోదీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్నార‌ని, కానీ ఇన్నేళ్ల‌లో ఆయ‌న ఒక్క‌సారి కూడా ఓపెన్‌గా మీడియా స‌మావేశంలో పాల్గొన‌లేద‌ని ఎడిట‌ర్స్ గిల్డ్ తెలిపింది. ఇది విచారించ‌ద‌గ్గ అంశ‌మ‌ని ఆ సంస్థ వెల్ల‌డించింది.

ఇటీవ‌ల నార్వే ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని మోదీని జ‌ర్న‌లిస్టు హెల్లి లింగ్ ఓ ప్ర‌శ్న‌వేశారు. దానికి ఆయ‌న సమాధానం ఇవ్వ‌లేదు. దీంతో ఆ అంశం వివాదాస్ప‌ద‌మైంది