సైలెంట్ స్కెచ్.. ఏపీ ‘డిఫెన్స్’ హైజాక్!

భారత్ న్యూస్ అమరావతి.ఒకే ఒక్క నెల.. సైలెంట్ స్కెచ్.. ఏపీ ‘డిఫెన్స్’ హైజాక్!

Ammiraju Udaya Shankar.sharma News Editor…పొరుగు రాష్ట్రాల పొలిటికల్ రాడార్లకు దొరక్కుండా… శత్రుదేశాల రాడార్లకు సైతం దొరకని AMCA స్టీల్త్ ఫైటర్ జెట్ ప్రాజెక్ట్‌ను ఆంధ్రప్రదేశ్ ఎలా దక్కించుకుందో తెలిపే మైండ్ బ్లోయింగ్ ఇన్‌సైడ్ స్టోరీ!

ఏపీ సీఎం చంద్రబాబు ఒక ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దిగితే ప్లానింగ్ ఏ రేంజ్‌లో ఉంటుందో చెప్పడానికి పుట్టపర్తి AMCA ప్రాజెక్ట్ ఒక క్లాసిక్ ఉదాహరణ.

తమిళనాడు ప్రభుత్వం మూడేళ్లుగా కష్టపడి, తమ హోసూర్‌కు ఈ ప్రాజెక్ట్ వస్తుందని ధీమాగా ఉన్న వేళ… ఏపీ కేవలం 30 రోజుల్లో ఈ ₹15,803 కోట్ల మెగా ప్రాజెక్ట్‌ను సైలెంట్‌గా లాగేసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”కు నిదర్శనంగా నిలిచిన ఈ “రహస్య వ్యూహం, రాకెట్ స్పీడ్” ఇన్‌సైడ్ టైమ్‌లైన్ ఇది:

తమిళనాడు మూడేళ్ల శ్రమ.. హోసూర్ ప్లాన్!

ఐదో తరం అధునాతన యుద్ధ విమానాల (AMCA) తయారీ కేంద్రాన్ని పారిశ్రామికంగా ఎంతో అభివృద్ధి చెందిన హోసూర్ వద్ద ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వం మూడేళ్లుగా కేంద్ర రక్షణ శాఖను కోరుతోంది.

తమిళనాడు ఆఫర్: హోసూర్‌లో విలువైన వందల ఎకరాల భూమిని ఉచితంగా ఇవ్వడానికి సిద్ధపడింది.

భౌగోళిక అనుకూలత: ఈ హోసూర్, డిజైన్ నోడల్ ఏజెన్సీ అయిన బెంగళూరు ‘ADA’ (Aeronautical Development Agency) కి కేవలం 40 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. అన్నీ అనుకూలంగా ఉన్నందున ప్రాజెక్ట్ తమకే వస్తుందని తమిళనాడు గట్టిగా నమ్మింది.

ఏప్రిల్ 2026: నెల రోజుల్లోనే కథ మొత్తం రివర్స్!

విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ఎలాగైనా ఏపీకి, ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమకు రావాలని పట్టుబట్టారు. విషయం బయటకు పొక్కితే తమిళనాడు అలర్ట్ అవుతుందని భావించి, అత్యంత గోప్యత పాటించారు. ఏప్రిల్ నెలలో ఏపీ ప్రభుత్వం కనబరిచిన వేగం ఇండస్ట్రీ వర్గాలనే ఆశ్చర్యపరిచింది:

ఏప్రిల్ 9: కేంద్ర రక్షణ శాఖతో ప్రాథమిక చర్చలు.
ఏప్రిల్ 20: రక్షణ శాఖ నుండి అధికారిక ప్రతిపాదనలు కోరిన ఏపీ.
ఏప్రిల్ 24: కేవలం 4 రోజుల్లోనే కావాల్సిన పూర్తి నివేదికలు, ప్రతిపాదనలను రక్షణ శాఖకు పంపేసింది.
ఏప్రిల్ 28: కేంద్ర రక్షణ శాఖ నుండి ఏపీ ప్రతిపాదనలకు అధికారిక అంగీకారం.
ఏప్రిల్ 29: కేంద్ర బృందం చేత పుట్టపర్తి స్థల పరిశీలన పూర్తి.
ఏప్రిల్ 30: ఏపీ క్యాబినెట్ ప్రత్యేకంగా సమావేశమై ఈ ప్రాజెక్ట్‌కు తక్షణ ఆమోదం.

నోట్: ఏపీ ప్రభుత్వం ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ కింద ఎన్నడూ లేని విధంగా స్పెషల్ జీవోలను కేవలం 48 గంటల్లో పాస్ చేసింది. సింగిల్ వికోండి క్లియరెన్స్ ద్వారా నీటి సరఫరా, విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం, రన్‌వే విస్తరణకు సంబంధించిన అనుమతి పత్రాలన్నింటినీ రక్షణ మంత్రిత్వ శాఖ టేబుల్ పైకి ఒకే నెలలో చేర్చారు.

ఏప్రిల్ 9న మొదలైన ప్రక్రియ ఏప్రిల్ 30 కల్లా.. అంటే కేవలం 21 రోజుల్లోనే పేపర్ వర్క్ నుండి క్యాబినెట్ అప్రూవల్ దాకా జెట్ స్పీడ్‌తో ముగిసిపోయింది! ఆ తర్వాత మే 15న రక్షణ మంత్రి రాజ์నాథ్ సింగ్ చేతుల మీదుగా శంకుస్థాపన కూడా జరిగిపోయింది.

పుట్టపర్తి ఎలా ప్లస్ అయింది?

బెంగళూరుకు సామీప్యత: కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేవలం 75 కిలోమీటర్ల దూరంలో ఉండటం శాస్త్రవేత్తల రాకపోకలకు ప్లస్ అయింది.
ఇన్‌ఫ్రాస్ట్రక్చర్: జాతీయ రహదారి, రైల్వే స్టేషన్ వంటి మౌలిక వసతులు సిద్ధంగా ఉండటం కలిసిసొచ్చింది.

వ్యూహాత్మక ప్రెజెంటేషన్: ఈ భౌగోళిక ప్రాధాన్యతలను రక్షణ శాఖ దృష్టిలో ఉంచి బాబు టీమ్ ప్రెజెంట్ చేసిన విధానానికి కేంద్రం ఫిదా అయిపోయింది.

తమిళనాడు సోషల్ మీడియాలో ‘పెదవి విరుపులు’

ఈ వార్త బయటకు రావడంతో తమిళనాడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

“మన రాష్ట్రంలో ఉన్న రాజకీయ అస్థిర పరిస్థితులు, వేగం లేని నిర్ణయాల వల్లే ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేజారిపోయింది. ప్రాజెక్టులను ఎలా లాక్కోవాలో ఏపీ సీఎం చంద్రబాబును చూసి మన నాయకులు ఆదర్శంగా తీసుకోవాలి” అని తమిళ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు మీమ్స్ క్రియేటర్లు: “కష్టపడి డిజైన్ చేసింది బెంగళూరు.. వసతులున్నది తమిళనాడులో.. కానీ లక్ కొట్టేసింది మాత్రం ఆంధ్రప్రదేశ్” అంటూ సెటైరికల్ మీమ్స్‌తో హల్చల్ చేస్తున్నారు.

విమర్శలు తాత్కాలికం.. అభివృద్ధి శాశ్వతం!

పొరుగు రాష్ట్రంలో చేసిన రెండు రోజుల ఎన్నికల ప్రచారంపై విమర్శలు చేసిన వారికి.. పుట్టపర్తి AMCA ప్రాజెక్ట్, కర్నూలు ‘డ్రోన్ సిటీ’, అనకాపల్లి ‘నేవల్ సిస్టమ్స్’ రూపంలో లభించిన ₹15,803 కోట్ల సమాధానం ఇది. తమిళనాడు తన పారిశ్రామిక బలాన్ని నమ్ముకుంటే, ఏపీ తన అల్ట్రా-స్పీడ్ బ్యూరోక్రసీ మరియు పొలిటికల్ నెట్‌వర్క్‌తో గేమ్ చేంజ్ చేసింది. ఇదే “స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్”! రక్షణ మంత్రి అన్నట్లు.. నిర్ణయాలు తీసుకోవడంలో AP అంటే ఆంధ్రప్రదేశ్ కాదు.. అడ్వాన్స్‌డ్ ప్రదేశ్!.