POCSO నిందితుడు బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు

భారత్ న్యూస్ హైదరాబాద్…POCSO నిందితుడు బండి భగీరథ్ కేసులో సోషల్ మీడియా పోస్టులపై కేసు నమోదు

ముందస్తు బెయిల్ విచారణ సందర్భంగా మహిళా జడ్జిపై అనుచిత ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు

విచారణ సందర్భంలోనూ సోషల్ మీడియా పోస్టుల గురించి ప్రస్తావించిన జడ్జి మాధవి

ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే జడ్జి మాధవి భర్తకు బార్ కౌన్సిల్ చైర్మెన్ పోస్ట్ ఇస్తారని సోషల్ మీడియాలో ప్రచారాలు

దీని వల్ల న్యాయ వ్యవస్థపై ప్రజలకు అపనమ్మకం ఏర్పడుతుందని పేర్కొన్న రిజిస్ట్రార్

పలు సోషల్ మీడియా పోస్టులను ఆధారాలుగా చూపిస్తూ ఫిర్యాదు

చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన హైకోర్టు రిజిస్ట్రార్

కేస్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న చార్మినార్ పోలీసులు