భారత్ న్యూస్ తిరుపతి…భద్రకాళి జయంతి 🚩
🚩 అపర ఏకాదశి 🚩
🚩 పరశురామ ద్వాదశి 🚩
బుధవారం గ్రహబలం పంచాంగం
మంగళవారం గ్రహాధిపతి “కుజుడు” మరియు “కేతువు”.
కుజుని అధిష్టాన దైవం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. కుజుని అనుగ్రహం కొరకు మంగళవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం భౌమాయ నమః ll
- ఓం శరవణభవాయ నమః ||
- ఓం రుద్రాయ నమః ||
కుజుని అనుగ్రహం కొరకు మంగళవారాలు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయాలను దర్శించండి. శ్రీ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని పఠించండి.
కేతువు యొక్క అధిష్టాన దైవం శ్రీ విగ్నేశ్వరుడు మరియు నాగ (సర్ప) దేవతలు. కేతువు అనుగ్రహం కొరకు మంగళవారం నాడు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం కేతవే నమః ||
- ఓం సర్పేభ్యో నమః ||
- ఓం గం గణపతయే నమః ||
- ఓం రుద్రాయ నమః ||
కేతువు యొక్క అనుగ్రహం కొరకు మంగళవారాలు వినాయకుని దేవాలయాలను కేతు కాలం/యమగండ కాలంలో (ఉదయం 9.00 నుండి 10.30 మధ్య) దర్శించండి. గణపతి స్తోత్రాలను, పఠించండి.
మంగళవారం లోహాలు, ఔషధం, అగ్ని, విద్యుత్, క్రీడా కార్యకలాపాల పనులకు అనుకూలం. కొత్త పనులకు, ప్రయాణాలకు అనుకూలం కాదు. తప్పనిసరిగా ప్రయాణం చేయవలసి వస్తే జాగ్రత్తగా ఉండండి. గొడవలు, ప్రమాదాలు మరియు ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి.
గ్రహ బలం కొరకు, మంగళవారం ఎరుపు, మెరూన్ మరియు గోధుమ (బ్రౌన్) రంగు దుస్తులు ధరించండి. మంగళవారం తలకు నూనె రాసుకుని తలంటు స్నానం చేస్తే, అకారణంగా గొడవలు పెరుగుతుంది. అనుకోని అపాయాలు కూడా జరగవచ్చు.
అమృత కాలం:
07:19 PM – 08:51 PM
దుర్ముహూర్తం:
11:57 AM – 12:49 PM
వర్జ్యం:
10:29 AM – 12:01 PM
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
శ్రీ పరాభవ నామ సంవత్సరం, వైశాఖ మాసం, కృష్ణ పక్షం,
తిథి:
ఏకాదశి: May 12 02:52 PM to May 13 01:30 PM
ద్వాదశి: May 13 01:30 PM to May 14 11:20 AM
ఏకాదశి ఆనందాన్ని ప్రసాదించే నంద తిథి. ఏకాదశి ఉపవాసం, పూజలు, పెళ్లి పనులు, శారీరక వ్యాయామాలు, నిర్మాణం, తీర్థయాత్ర, ఉత్సవాలు, అలంకరణ వంటి వాటికి అనుకూలమైన తిథి.
ఏకాదశి తిథి, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాలు సందర్శించడానికి, ఉపవాసం ఉండటానికి, శ్రీ మహా విష్ణు ఆరాధనకు, శ్రీ మహా విష్ణు మంత్రాలు, స్తోత్రాలు పఠించడానికి అత్యంత శుభప్రదమైన రోజు.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
నక్షత్రం:
ఉత్తరాభాద్రపద: May 13 01:17 AM to May 14 12:17 AM
రేవతి: May 14 12:17 AM to May 14 10:33 PM
ఉత్తరాభాద్ర నక్షత్రానికి అధిపతి “శనైశ్చరుడు”. అధిష్టాన దేవత “ఆహిర్బుద్నియ”. ఇది స్థిరమైన ప్రకృతి స్వభావం గల నక్షత్రం.
ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నరోజు స్మరించవలసిన మంత్రాలు:
- ఓం శనైశ్చరాయ నమః ||
- ఓం అహిర్బుధ్న్యాయ నమః ||
ఉత్తరాభాద్ర నక్షత్రం ఉన్నరోజు – బావులు త్రవ్వడం, పునాదులు వేయడం, ప్రాయశ్చిత్త కర్మలు చేయడం, పదవులు చేపట్టడం, భూములు కొనుగోలు చేయడం, పుణ్య కార్యాలు, విత్తనాలు నాటడం, ఆలయ నిర్మాణం, వివాహా ప్రయత్నాలు వంటి శాశ్వత ప్రభావం కోరుకునే అన్ని పనులకు అనుకూలం.
🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️
మీకు సాధ్యమైనప్పుడల్లా అనాధలకు, జంతువులకు, పక్షులకు ఆహారాన్ని, త్రాగు నీటిని అందించండి. ఇలా చేయడం వలన లభించే పుణ్య బలం తో జాతక రీత్యా మీరు అనుభవించాల్సిన ఎన్నో కష్టాలు మీకు తెలియకుండానే తొలగిపోతుంది.
చెట్లను నాటి, వాటిని సంరక్షించడాన్ని శివ పురాణం “స్థావర లింగ పూజ” గా వర్ణించింది. కాబట్టి మీరు చెట్లను నాటి వాటిని సంరక్షించారంటే, పర్యావరణాన్ని కాపాడడం తో పాటు విశేష దైవానుగ్రహాన్ని కూడా పొందవచ్చు.

లోకాః సమస్తాః సుఖినో భవంతు ||
శుభం భూయాత్ ||
🙏