భారత్ న్యూస్ విజయవాడ…మారిన రిజర్వేషన్ చార్జ్ నిబంధనలు!
వెయిటింగ్ లిస్ట్, RAC ప్రయాణికుల సౌకర్యార్థం భారతీయ రైల్వే చార్ట్ ప్రిపరేషన్ సమయాలను సవరించింది.
కొత్త నిబంధనల ప్రకారం, ఉదయం 5:01 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య బయల్దేరే రైళ్ల చార్ట్ ముందు రోజు రాత్రి 8 గంటలకే సిద్ధమవుతుంది.

మిగతా సమయాల్లో (మధ్యాహ్నం 2 నుంచి తెల్లవారుజాము 5 వరకు) నడిచే రైళ్ల చార్టులు ప్రయాణానికి 10 గంటల ముందే రూపొందిస్తారు. దీంతో ప్రయాణికులు తమ టికెట్ స్థితిని ముందుగానే తెలుసుకోవచ్చు.