ఇంటిగ్రేటెడ్‌ భూభారతి’ రిజిస్ట్రేషన్‌కు పది రోజులు!

భారత్ న్యూస్ వరంగల్….ఇంటిగ్రేటెడ్‌ భూభారతి’ రిజిస్ట్రేషన్‌కు పది రోజులు!

తెలంగాణ :

తెలంగాణ రాష్ట్రంలో భూముల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం ‘ఇంటిగ్రేటెడ్‌ భూభారతి’ పోర్టల్‌ను ప్రవేశపెట్టింది. ఈ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి కావడానికి సుమారు పది రోజులు పడుతుంది.

కొత్త విధానంలో భాగంగా, ప్రతి రిజిస్ట్రేషన్‌కు అక్షాంశాలు, రేఖాంశాలతో కూడిన ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌ను జతచేయడం తప్పనిసరి.

ఈ నెల 2వ తేదీ నుంచి ఐదు మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్‌గా ఈ ప్రక్రియ అమలు జరుగుతోంది.

రిజిస్ట్రేషన్ సమయంలోనే ప్రతి భూమికి 11 అంకెల భూదార్ నంబర్ కేటాయించి, మ్యాప్‌ను జతచేస్తారు.

ఈ ప్రక్రియలో ప్రతి దశలోనూ దరఖాస్తుదారుడికి SMS ద్వారా సమాచారం అందుతుంది.