భారత్ న్యూస్ ఖమ్మం…..సాదాబైనామాల క్రమబద్దీకరణకు ప్రభుత్వం చర్యలు
తెలంగాణ :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. సాదాబైనామాల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టింది.
భూ క్రయ, విక్రయదారుల అఫిడవిట్ల నిబంధన చిక్కులను తొలగిస్తూ, ఆర్డీవోలే విచారణాధికారులుగా దరఖాస్తుల పరిశీలనకు ప్రభుత్వం ఆదేశించింది.
గతంలో సాదాబైనామాల క్రబద్దీకరణ అధికారాలు తహసీల్దార్లు పూర్తి చేసేవారు.

కానీ, ఇప్పుడు తహసీల్దార్లు విచారణ నివేదిక పంపిస్తే వాటిని ఆర్దీవోలు పరిశీలించి భూ భారతి పోర్టల్లో భూమికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేసి హక్కులు కల్పించనున్నారు.