జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగింపు

భారత్ న్యూస్ అనంతపురం..జర్నలిస్టు హెల్త్ స్కీమ్ పొడిగింపు
• జీవో ఎం.ఎస్ నెం. 43 విడుదల

  • జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్

అనంతపురము, ఏప్రిల్ 16:

  • వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీమ్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి పొడిగిస్తూ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ జీవో యం.యస్ నెం: 43 ను జారీ చేసినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ, సంచాలకులు శ్రీ కేఎస్ విశ్వనాథన్ ఒక ప్రకటనలో తెలిపారనీ, కావున జిల్లా వ్యాప్తంగా అక్రిడిటేషన్లు అమలులో ఉన్న వర్కింగ్ జర్నలిస్టులందరూ ఈ పథకం ప్రీమియం క్రింద రూ. 1250/- www.cfms.ap.gov.in వెబ్ సైట్ ద్వారా ఈ క్రింద తెలిపిన పద్దుకు చెల్లించి లబ్ధి పొందవలసినదిగా జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు.

Head of Account: 8342-00-120-01-03-001-001, DDO Code: 2703 0802 003

  • వర్కింగ్ జర్నలిస్టు హెల్త్ స్కీం ప్రీమియం రూ.2,500 కాగా ఇందులో జర్నలిస్టు వాటా రూ.1,250, ప్రభుత్వం తన వాటా రూ.1,250 చెల్లిస్తుందన్నారు. జర్నలిస్టు, భార్య/భర్త, పిల్లలు, జర్నలిస్టుపై ఆధారపడిన తల్లిదండ్రులకు ఈ స్కీమ్ వర్తిస్తుందన్నారు.

– ప్రీమియం చెల్లించిన జర్నలిస్టులు ఒరిజినల్ చలానా, అక్రెడిటేషన్ కార్డ్ జిరాక్స్ మరియు హెల్త్ కార్డ్ జిరాక్స్ సమర్పించాలన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకునే వారు తమ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులు, ఫొటోలు, JPG ఫార్మాట్ లో సంబంధిత జిరాక్స్ కాపీలను అనంతపురము జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ, ఆదిమూర్తి నగర్, రైతు బజార్ పక్కన గల కార్యాలయంలో పని వేళల్లో అందజేయాల్సిందిగా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.

డి ఐ పి ఆర్ ఓ, అనంతపురము