.భారత్ న్యూస్ హైదరాబాద్….ఏకంగా 67 మంది యువతులను మోసం చేసిన బాలకృష్ణ
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి వేషధారణలో తిరుగుతున్న నిందితుడు బాలకృష్ణను అరెస్ట్ చేసిన శంషాబాద్ పోలీసులు.
మొదట అతని ప్రవర్తనపై అనుమానం రావడంతో ప్రశ్నించగా పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు.
విచారణలో చెప్పిన విషయాలు విని పోలీసులే షాక్‌కు గురయ్యారు.
పెళ్లి కాని యువతులను వివాహం పేరుతో మోసం చేసేందుకే పోలీస్ దుస్తులు వేసుకున్నట్లు ఒప్పుకున్నాడు.
మ్యాట్రిమొనీ వెబ్‌సైట్లలో పోలీస్ అధికారిగా పరిచయం చేసుకుని యువతులకు వల వేసినట్లు తెలిపాడు.
ఇప్పటివరకు 67 మంది మహిళలను బురిడీ కొట్టించినట్లు అంగీకరించాడు. నమ్మకం కలిగించిన తర్వాత డబ్బులు, ఇతర ప్రయోజనాల కోసం మోసాలకు పాల్పడినట్లు వెల్లడించాడు.

నిందితుడు బాలకృష్ణ శ్రీకాకుళం జిల్లా వాసిగా అధికారులు గుర్తించారు.