భారత్ న్యూస్ వరంగల్….. …..బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీస్

Ammiraju Udaya Shankar.sharma News Editor…అంగన్వాడి మొబైల్ ఫోన్ల కొనుగోలు విషయంలో నిరాధార ఆరోపణలు చేస్తూ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా టిఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు అంటూ కేసిఆర్ కు మంత్రి సీతక్క లీగల్ నోటీసు..!
రిజిస్టర్ పోస్టు ద్వారా కెసిఆర్ కు లీగల్ నోటీస్ పంపిన సీతక్క తరుపు అడ్వకేట్ నాగులూరి కృష్ణ కుమార్..!
అంగన్వాడీ మొబైల్ ఫోన్ల కొనుగోలు ప్రక్రియను తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ లిమిటెడ్ నిర్వహించిందని, టెండర్ ఇవాల్యుయేషన్ కమిటీ నిర్ణయాల ప్రకారం కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని, ఇందులో తనకు ఎలాంటి సంబంధం లేదని నోటీసులో స్పష్టం చేసిన మంత్రి సీతక్క
మొత్తం టెండర్ విలువ రూ. 44 కోట్లే ఉన్నప్పటికీ, అందులో రూ. 30 కోట్ల అవినీతి జరిగిందని చెప్పడం అసంబద్ధం, ఆధారాలు లేని ఆరోపణగా పేర్కొన్న మంత్రి సీతక్క
BRS party అఫీషియల్ సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి కెసిఆర్ బాధ్యత వహించాలని డిమాండ్ చేసిన మంత్రి సీతక్క..

తన ప్రతిష్టను దెబ్బతీసేలా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్న మంత్రి…