శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల సేవలో విక్కుర్తి.

భారత్ న్యూస్ విజయవాడ…శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల సేవలో విక్కుర్తి.

నూతనంగా ప్రతిష్టించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల సేవలో ప్రముఖ పారిశ్రామికవేత్త, కూటమి నాయకులు, VVR ఫౌండేషన్ చైర్మన్ విక్కుర్తి వెంకట శ్రీనివాసరావు తరించారు.

నాగాయలంకలో నూతనంగా నిర్మించిన శ్రీ భూ నీలా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయములో శ్రీ గోదా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి గరుత్మంత, జయం విజయ, విమాన శిఖర జీవ ధ్వజస్తంభ ప్రతిష్ట మహోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అలాగే కోడూరులో శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆలయ ధ్వజస్తంభ పున: ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు.

ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు విక్కుర్తి శ్రీనివాస్ సోమవారం ఉదయం నూతనంగా ప్రతిష్టించిన ఆలయాలను సందర్శించి, శ్రీ స్వామి, శ్రీ అమ్మవార్లను దర్శించుకుని ఆలయాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు.

ఆయా కార్యక్రమాలలో కనకమేడల రామబ్రహ్మం , గోగినేని సోమశేఖర్,వేమూరి ప్రభాకర్ , వేమూరి బుజ్జి,బడే వీర బాబు, పెద్ది భాస్కర్, నాగం బాపయ్య, మాచెర్ల భీమయ్య, కోసూరి రాజా, గట్టిపాటి నాగేశ్వరరావు, మెండు లక్ష్మణ రావు, ఉప్పల ప్రసాద్, పున్నయ్య దాసు, తాత రావు, కన్నా వెంకటేశ్వర రావు (చిన్న), తుమ్ము అర్జున రావు, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.