భారత్ న్యూస్ వరంగల్..ఇంటర్ ఫలితాల్లో దివ్య సంచలనం…
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో కొమరంభీం జిల్లా, కౌటాల మండలం కనికి గ్రామానికి చెందిన జాడి దివ్య BiPC విభాగంలో 435 మార్కులు సాధించి జిల్లాలోనే అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. జాడి రామ్ కుమార్-సునీత దంపతుల కుమార్తె అయిన దివ్య, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 60కి 60 మార్కులు సాధించి అందరినీ ఆకట్టుకున్నారు. గ్రామీణ విద్యార్థిని సాధించిన ఈ ఘనవిజయంపై గ్రామస్తులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయం జిల్లాకే గర్వకారణంగా నిలిచింది….
