భారత్ న్యూస్ ఖమ్మం…..రేపు ‘దోస్త్’ నోటిఫికేషన్
Apr 12, 2026,
రేపు ‘దోస్త్’ నోటిఫికేషన్
తెలంగాణ : డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) నోటిఫికేషన్ను రేపు(సోమవారం) విడుదల చేయనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026-27 విద్యా సంవత్సరంలో ప్రవేశాలకు నోటిఫికేషన్ను సోమవారం ఉదయం 11:30 గంటలకు విడుదల చేస్తామని పేర్కొన్నారు. 3 విడుతల్లో సీట్లను భర్తీ చేస్తామని, ఈ నెల 15 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతాయని, వారం తర్వాత నుంచి వెబ్ ఆప్షన్లు ఉంటాయని తెలిపారు.
