నిద్రపోతున్న ఎక్సైజ్ : మేల్కొన్న పోలీస్..!

భారత్ న్యూస్ తిరుపతి…అన్నమయ్య జిల్లా మదనపల్లె

నిద్రపోతున్న ఎక్సైజ్ : మేల్కొన్న పోలీస్..!

అన్నమయ్య జిల్లా మదనపల్లె మద్యం షాపుల్లో వరుసగా అఘాయిత్యాలు, దాడులు, జరుగుతున్న నేపథ్యంలో మీడియాలో వరస కథనాలు ప్రచురితం అవుతున్న సంగతి పాఠకులకు తెలిసిందే. ఇంత జరుగుతున్న మదనపల్లె ఎక్సైజ్ అధికారులు మాత్రం నిద్ర మత్తు వీడటం లేదు. అయితే పోలీసులు మాత్రం మేల్కొన్నారు. ఎక్సైజ్ అధికారులు చేసే తప్పులకు తామెందుకు చెడ్డపేరు తెచ్చుకోవాలని ఆలోచించారో ఏమో..? ఆదివారం రాత్రి మదనపల్లె పోలీసులు రాత్రి 10 గంటలకే మద్యం షాపుల వద్దకు బందోబస్తు మధ్య వాలిపోయారు. టైం టు టైం మద్యం దుకాణాలను దగ్గరుండి మరీ మూసి వేయిస్తున్నారు. మద్యం షాపుల్లో ప్రభుత్వ నిబంధనలకు పాతరవేసి, సిట్టింగ్ రూముల్లో ఇస్టారాజ్యంగా విక్రయాలకు పాల్పడుతున్నారనే, ఆరోపణలు ఉన్నాయి. పర్మిట్ రూములను నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటుచేసి అందులోనే మద్యం దుకాణాల యజమానులు అన్ని సౌకర్యాలు కల్పించారనే చర్చ జోరుగా సాగుతోంది. మామూళ్ళ మత్తులో జోగుతున్న ఎక్సైజ్ అధికారులు స్పందించక పోయినా.. పోలీసులు మాత్రం స్పందించి దుకాణాలు రాత్రి పది గంటలకే మూపించి.. గొడవలు, అల్లర్లు జరగకుండా మేల్కొనడంపై పోలీసుల