మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

భారత్ న్యూస్ హైదరాబాద్….స్వాతంత్య్ర సమరయోధుడు, మాజీ ఉప ప్రధానమంత్రి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 119వ జయంతి సందర్భంగా జూబ్లీ హిల్స్ నివాసంలో ఆ మహనీయుడి చిత్రపటానికి ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు పుష్పాంజలి ఘటించారు.

కుల వివక్ష, అంటరానితనం నిర్మూలనకు, దళితుల సామాజిక న్యాయం కోసం జగ్జీవన్ రామ్ గారు జీవితాంతం పనిచేశారని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు గుర్తుచేసుకున్నారు. జగ్జీవన్ రామ్ గారి స్ఫూర్తితో తెలంగాణలో సామాజిక న్యాయం, అన్ని వర్గాల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు.