ఇవాళ రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!

భారత్ న్యూస్ వరంగల్…..ఇవాళ రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!

Apr 03, 2026,

ఇవాళ రాత్రి నుంచి రెండు రోజులపాటు మీ సేవలు బంద్..!
తెలంగాణ : కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌లోడ్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా మీసేవ కేంద్రాల్లో శుక్రవారం రాత్రి నుంచి అన్ని సేవలు నిలిచిపోనున్నాయి. షెడ్యూల్డ్ మెయింటెనెన్స్ కోసం ఈ తాత్కాలిక అంతరాయం ఏర్పడుతుందని మీసేవ నిర్వాహకులు తెలిపారు. కొత్త సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కావడానికి 36 గంటల సమయం పట్టనుంది. శనివారం, ఆదివారం సెలవులు కావడంతో, మీసేవలు సోమవారం ఉదయం నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని నిర్వాహకులు ప్రజలకు సూచించారు.