భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్లోనే అత్యధికంగా ఇంటర్నెట్ షట్డౌన్లు!
2025 ఏడాదిలో ప్రజాస్వామ్య దేశాల్లో భారత్లోనే అత్యధిక ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదయ్యాయని తాజా నివేదిక ఒకటి వెల్లడించింది.

ప్రపంచ డిజిటల్ హక్కుల పరిరక్షణ సంస్థ ‘యాక్సెస్ నౌ’ నివేదిక ప్రకారం, 2025లో భారత్లో 65 ఇంటర్నెట్ షట్డౌన్లు జరిగాయి. ఒక ప్రజాస్వామ్య దేశానికి ఇది ఆందోళన కలిగించే అంశమని నివేదిక అభిప్రాయపడింది.
గత ఏడాది భారత్లోని 12 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నిరసనలు, ఘర్షణ పరిస్థితులు, మతపరమైన పండుగల సమయంలో ఇంటర్నెట్ సేవల్ని నిలిపివేశారని తెలిపింది. గత సంవత్సరం 52 దేశాల్లో మొత్తం 313 ఉద్దేశపూర్వక ఇంటర్నెట్ షట్డౌన్లు నమోదయ్యాయి. 2016 తర్వాత ఇదే అత్యధికం.