భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా…నిలిచిపోయిన ఎగుమతులు.. పడిపోతున్న బియ్యం ధరలు
తెలంగాణ : ఇరాన్, ఇజ్రాయెల్-అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం పలు రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ మేరకు భారత్ నుంచి బియ్యం ఎగుమతులు ఆగిపోయాయి. దీంతో రాష్ట్రంలో బియ్యం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నెల 8న దొడ్డు ధాన్యం ధర క్వింటా రూ.2,550 ఉండగా ప్రస్తుతం రూ.2,450కి తగ్గింది. మరో రూ.150 వరకు తగ్గే ఛాన్స్ ఉందని మిల్లర్లు చెబుతున్నారు. ఈ సీజన్‌లో మరో 145L టన్నుల బియ్యం మార్కెట్లోకి రానుందని, ఎక్స్‌పోర్ట్ ఆగిపోయినందున కొనేందుకు వ్యాపారులు ఆసక్తి చూపరని పేర్కొంటున్నారు
