షాకింగ్ ఇన్సిడెంట్ ఇన్ హైదరాబాద్ పోచారం: రాంబాయి’ మూవీ స్టైల్‌లో రియల్ హారర్!

.భారత్ న్యూస్ హైదరాబాద్….షాకింగ్ ఇన్సిడెంట్ ఇన్ హైదరాబాద్ పోచారం: ‘రాంబాయి’ మూవీ స్టైల్‌లో రియల్ హారర్!

హైదరాబాద్ పోచారంలో జరిగిన ఈ భయానక ఘటన మనల్ని ఆలోచింపజేస్తుంది! ఒక యువకుడు తనను పెళ్లి చేసుకోవాలని నిరాకరించిన యువతికి, తన ఎయిడ్స్ ఇన్ఫెక్టెడ్ రక్తాన్ని ఇంజెక్ట్ చేశాడు.

ఈ యువకుడు మనోహర్‌కు, అతని తల్లిదండ్రులకు గతంలోనే ఎయిడ్స్ ఉంది. వీరి మధ్య వివాహం నిశ్చయమైంది, కానీ ఎయిడ్స్ తెలిసిన తర్వాత యువతి నిరాకరించింది.ఈ నెల 11న మనోహర్ యువతి ఇంటికి వెళ్లి, “నన్ను పెళ్లి చేసుకో” అంటూ ఒత్తిడి చేశాడు. ఆమె మళ్లీ నో చెప్పడంతో, కోపంతో ఎయిడ్స్ ఇంజెక్షన్ చేసి పారిపోయాడు! పోచారం పోలీసులు మనోహర్‌ను అదుపులోకి తీసుకున్నారు.