భారత్ న్యూస్ విజయవాడ…అస్సాంలో సుఖోయ్ యుద్ధవిమానం గల్లంతు!
భారతీయ వైమానిక దళానికి చెందిన సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐ యుద్ధ విమానం గురువారం సాయంత్రం అస్సాంలో అదృశ్యమైంది. అస్సాంలోని జోర్హాట్ నుంచి బయల్దేరిన యుద్ధ విమానం రాత్రి 7.42 గంటల తర్వాత రాడార్ కాంటాక్ట్‌ని కోల్పోయింది. వెంటనే ఐఏఎఫ్ గాలింపు, సహాయక చర్యలను చేపట్టింది.
కనిపించకుండా పోయిన ఫైటర్ జెట్ ఆచూకీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐఏఎఫ్ ఎక్స్‌లో వెల్లడించింది. 2000 దశకం ప్రారంభంలో భారతీయ వైమానిక దళం అమ్ములపొదిలో చేరిన సుఖోయ్ ఎస్‌యూ-30ఎంకేఐ యుద్ధ విమానం వైమానిక దళానికి వెన్నెముకగా నిలుస్తున్నది. ఈ ట్విన్ ఇంజిన్, మల్టీరోల్ ఫైటర్ జెట్‌ని రష్యా అభివృద్ధి చేయగా, భారతీయ, ఫ్రెంచ్, ఇజ్రాయెలీ ఏవియోనిక్స్ ఆయుధ వ్యవస్థలు ఇందులో మిళితమై ఉన్నాయి.
