న్యాయ వ్యవస్థ అమరావతిని నిలబెట్టింది, ఇవ్వాళ అమరావతి న్యాయ దేవతను గర్వించేలా చేస్తోంది

..భారత్ న్యూస్ అమరావతి..న్యాయ వ్యవస్థ అమరావతిని నిలబెట్టింది, ఇవ్వాళ అమరావతి న్యాయ దేవతను గర్వించేలా చేస్తోంది

అమరావతి చాటిన సరికొత్త న్యాయ సూత్రం

నేడు న్యాయస్థానాల్లో లక్షలాది కేసులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉండి, సామాన్యుడికి న్యాయం అందని ద్రాక్షలా మారుతున్న తరుణంలో, విజయవాడ వేదికగా జరిగిన రాష్ట్ర స్థాయి సదస్సు సరికొత్త దిశానిర్దేశం చేసింది. సమస్యలకు పరిష్కారం కేవలం ‘తీర్పు’ లోనే కాదు, ‘రాజీ’లో కూడా ఉంటుందని ఈ సదస్సు చాటిచెప్పింది.

భారత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నట్లు.. “మధ్యవర్తిత్వం అనేది భారతదేశ డిఎన్ఏ లోనే ఉంది.” వేల ఏళ్ల క్రితం కురుక్షేత్ర యుద్ధాన్ని ఆపడానికి శ్రీకృష్ణుడు చేసిన రాయబారమే దీనికి తొలి అడుగు. నేడు ఆధునిక కాలంలో కూడా కోర్టు మెట్లు ఎక్కకుండా, మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడమే అత్యున్నతమైన పద్ధతి. అందుకే ఆయన “మధ్యవర్తిత్వం అనేది కేవలం ప్రత్యామ్నాయం కాదు.. అది మన వృత్తిపరమైన సంస్కృతిలో భాగం కావాలి” అని ఇచ్చిన పిలుపు ఆలోచింపజేస్తోంది.

అమరావతి: ఒక గొప్ప ‘మధ్యవర్తిత్వ’ పాఠం!

ఈ సదస్సులో అందరినీ ఆశ్చర్యపరిచిన మరియు గర్వపడేలా చేసిన అంశం ఏంటంటే.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరవతి