భారత్ న్యూస్ తిరుపతి…లారీ డ్రైవర్ కోసం ప్రియుడిని చంపిన టీవీ నటి
బెంగళూరులో దారుణం చోటుచేసుకుంది. మరో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్న ఓ టీవీ నటి, తాను లివింగ్‌లో ఉంటున్న ప్రియుడిని దారుణంగా హత్య చేసింది. నటి ఊర్మిలా అలియాస్ బిందు, లారీ డ్రైవర్ వినయ్‌ను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం తెలిసిన ప్రియుడు మోహన్ కృష్ణ అడ్డు వస్తున్నాడని భావించి.. వినయ్, అతని స్నేహితుడు దనుష్‌తో కలిసి ఇంట్లోనే మోహన్‌కు మద్యం తాగించి, ఆపై కత్తులతో దాడి చేసి హత్య చేసింది. రెండు వారాల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, కుళ్లిపోయిన స్థితిలో మోహన్ మృతదేహం లభ్యమైంది….
